గురువారం, జూన్ 11, 2026
టెక్నాల‌జీ

Jio Rs 198 Prepaid Plan : జియోలో త‌క్కువ ధ‌ర‌కే అన్‌లిమిటెడ్ 5జి డేటాను ఇచ్చే ప్లాన్‌..!

Jio Rs 198 Prepaid Plan : టెలికాం సంస్థ రిల‌యన్స్ జియో త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం ఓ స‌రికొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. త‌క్కువ ధ‌ర‌కే అన్‌లిమిటెడ్ 5జిని వాడుకునేలా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు…

Jio Rs 198 Prepaid Plan : జియోలో త‌క్కువ ధ‌ర‌కే అన్‌లిమిటెడ్ 5జి డేటాను ఇచ్చే ప్లాన్‌..!

Jio Rs 198 Prepaid Plan : టెలికాం సంస్థ రిల‌యన్స్ జియో త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం ఓ స‌రికొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. త‌క్కువ ధ‌ర‌కే అన్‌లిమిటెడ్ 5జిని వాడుకునేలా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు గాను క‌స్ట‌మ‌ర్లు రూ.198తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ 5జి మొబైల్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులుగా ఉంది.

జియో అందిస్తున్న రూ.198 ప్లాన్ ద్వారా క‌స్ట‌మర్లు రోజుకు 2 జీబీ 4జి డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను ఉచితంగా అందిస్తారు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు. ఇక జియోలో అన్‌లిమిటెడ్ 5జి యాక్సెస్‌తో ల‌భిస్తున్న అత్యంత చ‌వ‌కైన ప్లాన్ ఇదే కావ‌డం విశేషం. అయితే దీన్ని నెల‌లో 2 రోజులు రీచార్జి చేసుకోవాలి. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.396 అవుతుంది. కానీ రూ.349 చెల్లిస్తే ఇదేలాంటి బెనిఫిట్స్‌తో 28 రోజుల వాలిడిటీ పొంద‌వ‌చ్చు. మ‌ర‌లాంట‌ప్పుడు జియో రూ.198 ప్లాన్‌ను ఎందుకు అందుబాటులోకి తెచ్చింది అన్న‌ది అర్థం కాని విష‌యం.

Jio Rs 198 Prepaid Plan full details know the benefits
Jio Rs 198 Prepaid Plan

ఎయిర్‌టెల్‌లో కాస్త ఎక్కువ‌..

జియో రూ.349 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జి డేటాను వాడుకోవ‌చ్చు. 4జి డేటా అయితే రోజుకు 2జీబీ డేటాను వాడుకోవ‌చ్చు. దీంట్లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత జియో యాప్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తాయి. అయితే ఎయిర్‌టెల్‌లో ఇదే ప్లాన్ కాస్త ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంది. ఎయిర్‌టెల్‌లో ఇందుకు క‌స్ట‌మ‌ర్లు రూ.379 చెల్లించాలి. కానీ దీంట్లో 30 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. ఇక బెనిఫిట్స్ మాత్రం జియోలో రూ.349 ప్లాన్‌ను పోలి ఉంటాయి. ఇలా క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన ప్లాన్‌ను రీచార్జి చేసుకుని ఆ మేర అన్‌లిమిటెడ్ 5జి డేటాను యాక్సెస్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.