గురువారం, జూన్ 11, 2026
lifestyle

Cheese And Butter : చీజ్ లేదా బ‌ట‌ర్ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే మీకు చేదు వార్త‌..!

Cheese And Butter : చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో చీజ్ లేదా బ‌ట‌ర్‌ను తింటున్నారు. వీటిని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లు మొద‌లుకొని రాత్రి చేసే డిన్న‌ర్ వ‌ర‌కు అనేక ర‌కాల వంట‌ల్లో వాడుతున్నారు. ఇక బేక‌రీ ఐట‌మ్స్‌లో వీటిని…

Cheese And Butter : చీజ్ లేదా బ‌ట‌ర్ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే మీకు చేదు వార్త‌..!

Cheese And Butter : చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో చీజ్ లేదా బ‌ట‌ర్‌ను తింటున్నారు. వీటిని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లు మొద‌లుకొని రాత్రి చేసే డిన్న‌ర్ వ‌ర‌కు అనేక ర‌కాల వంట‌ల్లో వాడుతున్నారు. ఇక బేక‌రీ ఐట‌మ్స్‌లో వీటిని త‌ప్ప‌క వాడుతారు. అయితే ఈ రెండింటినీ ఎక్కువ‌గా తింటున్న‌వారికి ఐసీఎంఆర్ చేదువార్త చెప్పింది. ఎందుకంటే ఈ రెండింటినీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలో చేరుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఐసీఎంఆర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలో చీజ్‌, బ‌ట‌ర్ చేర‌డం వ‌ల్ల ఇక అవి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కావ‌ని వైద్యులు చెబుతున్నారు.

ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మ‌న‌కు బ‌య‌ట ల‌భించే రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నమాట‌. నిల్వ చేసిన ఆహారాలు, చిప్స్‌, కుకీస్‌, స్వీట్లు వంటివి ఈ జాబితాకు చెందుతాయి. అయితే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇంకా ఎక్కువగా ప్రాసెస్ చేయ‌బ‌డిన‌వ‌ని అర్థం. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ క‌న్నా మిక్కిలి హానిక‌ర‌మైన‌వ‌ని అర్థం చేసుకోవాలి. అందువ‌ల్ల ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను అస‌లు తిన‌కూడ‌దు. తింటే అనేక దుష్ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

if you are taking Cheese And Butter regularly then beware
Cheese And Butter

పరాటా, పిజ్జా, ప‌ఫ్స్, పేస్ట్రీలు, కేకులు వంటి అనేక బేక‌రీ ఐట‌మ్స్‌లో బ‌ట‌ర్‌, చీజ్ వాడుతారు. క‌నుక ఈ ప‌దార్థాల‌ను తిన‌డం అస‌లు ఇంక ఏమాత్రం మంచిది కాదు. క‌నుక వీటిని ఎక్కువ‌గా తింటున్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. లేదంటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక చీజ్‌, బ‌ట‌ర్ విష‌యంలో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.