గురువారం, జూన్ 11, 2026
వినోదం

Guppedantha Manasu Rishi : గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ రిషి హీరోగా గీతా శంక‌రం.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్

Guppedantha Manasu Rishi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం చేయ‌నక్క‌ర్లేని సీరియ‌ల్ గుప్పెడంత మ‌న‌సు. ఇందులో ప్ర‌ధాన పాత్ర రిషి( ముఖేష్ గౌడ‌) త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో అల‌రించాడు. ఇన్నాళ్లు బుల్లితెర‌పై అలరించిన రిషి ఇప్పుడు వెండితెర‌పై సంద‌డి…

Guppedantha Manasu Rishi : గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ రిషి హీరోగా గీతా శంక‌రం.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్

Guppedantha Manasu Rishi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం చేయ‌నక్క‌ర్లేని సీరియ‌ల్ గుప్పెడంత మ‌న‌సు. ఇందులో ప్ర‌ధాన పాత్ర రిషి( ముఖేష్ గౌడ‌) త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో అల‌రించాడు. ఇన్నాళ్లు బుల్లితెర‌పై అలరించిన రిషి ఇప్పుడు వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. గీతా శంక‌రం అనే సినిమాతో సిల్క‌ర్ స్క్రీన్‌కి ప‌రిచ‌యం కాబోతున్నాడు. ముకేష్ గౌడ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న గీతా శంక‌ర్ చిత్రంని ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై నూతన దర్శకుడు రుద్ర తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇందులో ప్రియాంక శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టించింది. దీపావ‌ళి పర్వ‌దినం సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.

చిత్ర పోస్ట‌ర్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. గీతా శంకరం’ అనే ఒక అందమైన పల్లెటూరి ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించబోతున్న‌ట్టు తెలుస్తుంది. మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. మా ఇష్టదైవమైన శ్రీ సెల్వమహాగణపతి పేరుపై ఆయన దీవెనలతో స్థాపించిన మా ‌ఎస్‌.ఎస్‌.ఎం.జి సంస్థ పేరు మీద ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేశాము. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాము. ఇక్కడ కూడా తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇదొక మంచి ప్రేమకథా దృశ్యకావ్యం. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈనెల 14 నుంచి కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది అన్నారు.

Guppedantha Manasu Rishi new movie launching poster released
Guppedantha Manasu Rishi

తాను సినిమా తీయాల‌ని అనుకున్న‌ప్పుడు త‌న‌కు 20 మంది కథ‌లు చెప్పార‌ని, దర్శకుడు రుద్ర చెప్పిన పాయింట్‌బాగా నచ్చి, సినిమా ప్రారంభించాం అని తెలియ‌జేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. ‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో న‌టుడు ముర‌ళీశ‌ర్మ హీరోయిన్‌ తండ్రిగా నటిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని, ప్రేక్షకులందరి ఆదరణ, ప్రోత్సాహంతో ఈ ‘గీతా శంకరం’ మంచి విజయం సాధిస్తుంద‌ని తాను భావిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న ముకేష్ గౌడ‌.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటానని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.