గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Vitamin B12 : ఇలా చేస్తే చాలు.. అస‌లు విట‌మిన్ బి12 లోపం ఏర్ప‌డ‌దు..!

Vitamin B12 : మనం తీసుకునే ఆహారం బట్టి, మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి హాని చేసే వాటికి, దూరంగా ఉండాలి. అలానే, అన్ని రకాల పోషకాలు అందేటట్టు చూసుకోవాలి. చాలామంది,…

Vitamin B12 : ఇలా చేస్తే చాలు.. అస‌లు విట‌మిన్ బి12 లోపం ఏర్ప‌డ‌దు..!

Vitamin B12 : మనం తీసుకునే ఆహారం బట్టి, మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి హాని చేసే వాటికి, దూరంగా ఉండాలి. అలానే, అన్ని రకాల పోషకాలు అందేటట్టు చూసుకోవాలి. చాలామంది, పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాహార లోపం కలగకుండా, సమతుల్యమైన ఆహారం తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది, బీ12 లోపంతో బాధపడుతూ ఉంటారు. బీ12 లోపం నుండి ఎలా బయటపడొచ్చు…?, ఏ ఆహార పదార్థాలని తీసుకోవాలి..?, ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.

ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. నీరసం ఎక్కువగా ఉండడం, జుట్టు బాగా రాలిపోవడం, నరాలు కాళ్లు మంటగా ఉండడం, రక్తహీనత ఇలా అనేక ఇబ్బందులు విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే కనబడుతుంటాయి. విటమిన్ బి12 లోపం ఉండకుండా ఉండాలంటే, రోజూ విటమిన్ 2.4 మైక్రోగ్రాములు తీసుకుంటే సరిపోతుంది. నిజానికి 2.4 మైక్రోగ్రామ్స్ మన పేగులే తయారు చేసేస్తాయి.

follow this tip to overcome Vitamin B12 deficiency
Vitamin B12

తయారుచేసి, మన శరీరానికి అందిస్తూ ఉంటుంది. చనిపోయిన కణాలలో ఉండే బి12 వల్ల మళ్ళీ మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కానీ, పేగుల ఆరోగ్యం బాగోకపోవడం వలన అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పొట్ట, పేగులకి విశ్రాంతి అనేది అవసరం. రాత్రి పూట విశ్రాంతి దొరికితే, బి12 ప్రొడ్యూస్ అవుతుంది. రాత్రిపూట చీకటి పడిన తర్వాత, ఆహార పదార్థాలను తీసుకోకుండా అలా పేగులకి రెస్ట్ దొరకడం వలన ఇది ప్రొడ్యూస్ అవుతుంది.

రాత్రి 9 నుండి ఉదయం 9 వరకు ఏమీ తినకపోవడం వలన డైజెషన్ ప్రాసెస్ ఆగుతుంది. మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది. మంచి బ్యాక్టీరియా ఎంతైతే పెరుగుతుందో, అంత ఎక్కువ బి12 వల్ల మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి బి12 లోపం ఉండదు. కాబట్టి, ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.