గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Bilva Leaves : ఈ ఆకుల‌ను రోజూ రెండు తినండి చాలు.. బీపీ, షుగ‌ర్ ఉండ‌వు..!

Bilva Leaves : ఈరోజుల్లో చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే, ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించడం ముఖ్యం. ప్రతిరోజు వ్యాయామం చేయడం,…

Bilva Leaves : ఈ ఆకుల‌ను రోజూ రెండు తినండి చాలు.. బీపీ, షుగ‌ర్ ఉండ‌వు..!

Bilva Leaves : ఈరోజుల్లో చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే, ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించడం ముఖ్యం. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచి నిద్ర ఇటువంటివన్నీ కూడా సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఇలా ఉంటే, ప్రతి ఒక్కరిలో ఇప్పుడు కామన్ గా ఉండే సమస్య బిపి, షుగర్.

బిపి, షుగర్ ఒక వయసు వచ్చిన తర్వాత అందరిలో ఉంటున్నాయి. ఈ బాధలు ఉండకుండా ఉండాలన్నా, వీటి నుండి బయటపడాలన్నా అనేక రకాల ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని మనం పాటించవచ్చు. ఒక్కొక్కసారి నిజానికి మందులకంటే, సహజ పద్ధతులు బాగా వర్క్ అవుట్ అవుతాయి. చిన్నచిన్న ఇంటి చిట్కాలు నిజంగా, గొప్ప పరిష్కారాన్ని చూపిస్తాయి. బిల్వ ఆకులని మనం పూజకి వాడతాము. ముఖ్యంగా, శివుడికి బిల్వ ఆకులు అంటే ఇష్టం.

Bilva Leaves take daily 2 for many benefits
Bilva Leaves

బిల్వలో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం అలానే ఇతర పోషకాలు కూడా బిల్వలో ఉన్నాయి. ఈ చెట్టు ఆకులు, పండ్లు తీసుకుంటే వాత, పిత్త, కఫ సమస్యల నుండి బయటపడొచ్చు. అధిక రక్తపోటు, గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ వంటి వాటిని కంట్రోల్ చేయడానికి బిల్వ బాగా ఉపయోగపడుతుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ ఆకులని మనం తీసుకుంటే, అనేక రకాల రోగాల నుండి బయటపడొచ్చు.

ఆయుర్వేదంలో కూడా, బిల్వకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని ఆకులని రోజు తీసుకోవడం వలన, బీపీ, డయాబెటిస్ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బిల్వ ఆకులని నీటిలో వేసి మరిగించి తాగితే, షుగర్ సమస్య నుండి దూరంగా ఉండొచ్చు. బిల్వ సిరప్ కడుపుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా, బిల్వతో ఇన్ని ప్రయోజనాలని పొందవచ్చు. ఇన్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా షుగర్, బీపిని కంట్రోల్ లో ఉంచుకోవడానికి అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.