గురువారం, జూన్ 11, 2026
వినోదం

Kotha Bangaru Lokam : కొత్త బంగారులోకం సినిమాని మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే..!

Kotha Bangaru Lokam : సినిమా తెర మీదకి వచ్చేవరకు, చిత్ర యూనిట్ ఎన్నో మార్పులు చేస్తూ వస్తుంది. మొదట డైరెక్టర్ ఒక హీరోని అనుకుని, సినిమాని స్టార్ట్ చేస్తారు. కానీ, అది లాస్ట్ కి ఎవరి దగ్గరికి…

Kotha Bangaru Lokam : కొత్త బంగారులోకం సినిమాని మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే..!

Kotha Bangaru Lokam : సినిమా తెర మీదకి వచ్చేవరకు, చిత్ర యూనిట్ ఎన్నో మార్పులు చేస్తూ వస్తుంది. మొదట డైరెక్టర్ ఒక హీరోని అనుకుని, సినిమాని స్టార్ట్ చేస్తారు. కానీ, అది లాస్ట్ కి ఎవరి దగ్గరికి వెళుతుందో తెలియదు. ఒక హీరోతో సినిమా చేయాలని, స్టోరీ ని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత, ఏవో కారణాల వలన ఆ అవకాశం ఇంకొకరికి వస్తుంది. కొత్త బంగారులోకం సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో సన్నివేశాలకి కుర్ర కారు ఫుల్ ఖుష్ అయిపోయారు.

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కెమిస్ట్రీ, ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి, 15 ఏళ్లు పూర్తయిపోయింది. 2008లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారులోకం తో, దర్శకుడుగా మారాలని అనుకున్నారు. అందులో హీరోగా స్టార్ హీరోని కాకుండా, కొత్త నటుడిని తీసుకురావాలని అనుకున్నారు. నాగచైతన్య తో సినిమా చేస్తే, బాగుంటుందని అనుకున్నారు డైరెక్టర్.

actors those who missed to do Kotha Bangaru Lokam movie
Kotha Bangaru Lokam

నాగార్జునని అందుకు సంప్రదించారు కూడా. కథ విన్న నాగార్జున, యాక్షన్ నేపథ్యంలో ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. దాంతో రిజెక్ట్ చేశారు. ఆ స్టోరీని రామ్ పోతినేని దగ్గరికి తీసుకువెళ్లారు. ఇంటర్ విద్యార్థి రోల్ కింద హీరో నటించాలి. కాబట్టి, రామ్ అందుకు నో చెప్పడం జరిగింది.

హ్యాపీ డేస్ సినిమా చాలా బాగుందని, అందులో కుర్రాడు బాగున్నాడని ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ శ్రీకాంత్ కి చెప్పగా.. ఫైనల్ గా వరుణ్ సందేశం హీరోగా పెట్టి, సినిమాని తీశారు. ఇలా వరుణ్ సందేశ్ ఈ సినిమాలో నటించి, మంచి పేరుని తెచ్చుకున్నారు. ఇంతమంది చేతులు మారి, ఆఖరికి వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం సినిమాతో హిట్టు కొట్టేశారు. అప్పట్లో ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.