Actress Annapurna : టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకున్నారు. దాదాపు 700 సినిమాలకు పైగా మూవీస్ చేసిన ఆమె.. ఓ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. అయితే ఆ అమ్మాయి పెద్ద వయసు వచ్చి, పెళ్లి కూడా చేసుకున్నాక ఆత్మహత్య చేసుకోవడం ఆమెకి తీరని శోకాన్ని మిగిల్చింది. కూతురు మరణం తర్వాత కొద్ది రోజుల పాటు సినిమాలకి, షూటింగ్స్‌కి దూరం అయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న అన్నపూర్ణ తాజాగా సుమ యాంకర్‌గా చేస్తున్న సుమ అడ్డా షోలో పాల్గొంది.
విజయ, శ్రీలక్ష్మి, జయలక్ష్మి అందరు కలిసి షోలో రచ్చ చేశారు. కామెడీ చేస్తూ మెప్పించారు. పంచ్‌లతో నవ్వులు పూయించారు. ఇక తన కూతురి ప్రస్తావన వచ్చినప్పుడు అన్నపూర్ణ చాలా ఎమోషనల్ అయింది. ఆ రోజు తాను బజ్జీలు తెస్తే తిన్నదని, ఇక చాలు అంటూ తన అత్తగారింటికి వెళ్లిపోయిందని, అయితే ఇలా చేస్తుందని తానుఅసలు అనుకోలేదు. ఆ రోజు నేను తెచ్చిన బజ్జీలు తిని మా అత్తగారింటికి వెళతాను అన్నది. ఇక్కడ ఉండమ్మా అంటే మా ఆయన ఉంటాడు కదా నేను అక్కడే పడుకుంటాను అని వెళ్లిపోయింది. తాను అలా ఉరి వేసుకొని చనిపోతుందని అస్సలు అనుకోలేదు అంటూ అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్ చేసింది.తాను ఇప్పటికీ తెల్లవారుఝామున గుర్తోస్తుందని అన్నపూర్ణ తెలియజేసింది.
ఆడపిల్ల అందంగా ఉంటుందని అందువల్ల పాపను దత్తత తీసుకున్నానని అన్నపూర్ణ చెప్పింది.కూతురుకు చదువు ఎక్కలేదని కూతురును పెంచుకున్నా చనిపోవడంతో ప్రయోజనం లేకపోయిందని అన్నపూర్ణ అన్నారు.ఆయుష్షును, అదృష్టాన్ని పట్టలేమని కూతురు ఆత్మహత్య గురించి ఎమోషనల్‌గా కామెంట్స్ చేసింది. తన బిడ్డ ఎప్పుడూ అత్తారింట్లో బాధ పెట్టారని కానీ, భర్త కష్ట పెడుతున్నాడని కానీ చెప్పలేదని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. అసలు వాళ్ళింట్లో ఏం జరిగిందనేది మాత్రం తనకు తెలియదని చెప్పారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళే కానీ.. ఎందుకిలా చేసుకుందో తనకైతే అర్థం కాలేదని అన్నారు.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…