Samantha : చై – సామ్ విడి పోతారని.. అమల, నాగార్జునకు ముందే తెలుసా ?

October 5, 2021 10:52 AM

Samantha : గత కొద్ది రోజుల నుంచి సమంత, నాగ చైతన్యల గురించి వస్తున్న వార్తలు నిజమేనని.. అక్టోబర్ 2వ తేదీన సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నాం.. అనే విషయాన్ని తెలియజేశారు. ఇలా ఒక్కసారిగా ఈ విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఎంతో షాక్ కి గురయ్యారు. అయితే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని నెలల క్రితమే నాగార్జున, అమలతో చెప్పినట్లు సమాచారం.

Samantha : చై - సామ్ విడి పోతారని.. అమల, నాగార్జునకు ముందే తెలుసా ?

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ వివాహ బంధం నుంచి విడిపోవాలని భావించి ఈ విషయాన్ని నాగార్జున, అమల దగ్గర చెప్పగానే అందుకు వారిద్దరూ ఏ విషయమైనా మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఒక్కసారి వివాహబంధంలో విడిపోతే జీవితాంతం ఆ బాధ వెంటాడుతుందని, కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అయితే సమంత, నాగచైతన్య బాగా ఆలోచించి తమ వివాహ బంధంలో విడిపోవాలని నిర్ణయించుకొని అక్టోబర్ 2వ తేదీన ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. వీరి విడాకుల తర్వాత నాగ్ స్పందిస్తూ.. చైతన్య, సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని, వారు విడిపోవడం చాలా బాధగా ఉందని, వారిద్దరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఎమోషనల్ అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment